Venus Williams: 44ఏళ్ళ తర్వాత టెన్నిస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. 1 y ago
అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చాలా రోజుల తర్వాత బరిలో దిగబోతోంది. 44 ఏళ్ల వీనస్‌కు కాలిఫోర్నియాలో జరిగే ఇండియన్‌వెల్స్ టోర్నీలో వైల్డ్‌కార్డు లభించింది. అయిదుసార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్.. రెండుసార్లు యుఎస్ ఓపెన్‌లో ఛాంపియన్ గా నిలిచింది. చెల్లి సెరెనా విలియమ్స్ తోడుగా 14 డబుల్స్ టైటిళ్లను కూడా వీనస్ చేజిక్కించుకుంది.