China: చైనా డ్రాగన్ - భారత్ ఏనుగు కలిసి నృత్యం చేయాలి..! 1 y ago
ఒకరినొకరు అణగదొక్కుకోవడం లేదా ఒకరినొకరు తగ్గించుకోవడం వలన భారత్- చైనాలకు ఎలాంటి ప్రయోజనం లేదని.. ఒకరికొకరు మద్దతిచ్చుకోవడంలోనే రెండు దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో "అతి శక్తిమంతమైన రాజకీయ విభాగంలో సభ్యుడైన వాంగ్.. వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చైనా డ్రాగన్ - భారత్ ఏనుగు కలిసి నృత్యం చేయాల్సిన అవసరం ఉందని.. అదే ఇరు దేశాలకు సరైన మార్గమని తెలిపారు. గ్లోబల్ సౌత్ దేశాలు కూడా బలపడతాయని అభిప్రాయపడ్డారు.