Vijay Kumar: "వైసీపీ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలు విఫలమయ్యాయి" 1 y ago
AP : గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందన్నారు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్. ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. 2019 - 24 లో వైసీపీ కాంట్రాక్టర్లు కూడా దిక్కులేని పరిస్థితి నెలకొందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా వక్రీకరించడం దారుణమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ని నాశనం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ ఏ నాడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని పట్టించుకోలేదని తెలిపారు. వైసీపీ చేయలేనిది కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం వలన గ్రామాలు శుభ్రంగా మారుతున్నాయన్నారు.