Mohanlal: చిరు, రజనీకాంత్‌ను నామినేట్ చేసిన మోహన్ లాల్ 1 y ago

featured-image

దేశంలో ఊబకాయం సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ పది మంది ప్రముఖులను మోదీ నామినేట్ చేశారు. వారిలో అగ్ర కథానాయకుడు మోహన్లాల్ పేరు ఉండడంతో తాజాగా ఆయన స్పందించారు. తన పేరును నామినేట్ చేసినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. హెల్దీ ఇండియాను నిర్మిద్దామంటూ.. మోహన్లాల్ కూడా 10 మంది సినీ ప్రముఖులను నామినేట్ చేశారు.

“ఒబెసిటీపై పోరాట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకు ధన్యవాదాలు మోదీజీ. ఇలాంటి ఆలోచనలతోనే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని రూపొందించగలం. నూనె వినియోగాన్ని తగ్గించడం వల్ల మార్పు రావొచ్చు. ఈ మిషన్లో చేతులు కలిపేందుకు నేనూ 10 మందిని నామినేట్ చేస్తున్నా. కలిసికట్టుగా ఉందాం.. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం” అంటూ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, టొవినో థామస్లను నామినేట్ చేశారు. హీరోయిన్లు మంజు వారియర్, కల్యాణి ప్రియదర్శన్, దర్శకుడు రవి, ప్రియదర్శన్లను కూడా మోహన్లాల్ నామినేట్ చేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD