Yoon Suk: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ భారీ ఊరట..! 1 y ago

featured-image

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని శుక్రవారం సియోల్ లోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న యూన్ సుక్ జనవరి చివరలో అరెస్టయిన సంగతి తెలిసిందే. చట్టపరమైన గడువు ముగిసిన తర్వాత అరెస్టు చేసినందు వల్ల తనను జైలు నుంచి విడుదల చేయాలని యోల్ చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తున్నట్లు, ఆయనపై ఉన్న అరెస్టు వారెంట్ను రద్దు చేస్తున్నట్లు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రకటించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD