Hit 3: హిట్ 3..అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ టీజర్ వచ్చేసింది 1 y ago
'హిట్' యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సరికొత్త చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. నాని కథానాయకుడిగా శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈసినిమా సిద్ధమవుతోంది. సోమవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని టీమ్ 'హిట్ 3' టీజర్ ను విడుదల చేసింది. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. వరుస హత్యలు.. అర్జున్ సర్కార్ వాటిని ఎలా చేదించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. శ్రీనిధి శెట్టి కథానాయిక. మే 1న ఇది విడుదల కానుంది.