France: ఫ్రాన్స్ అత్యాధునిక ఫైటర్ జెట్ ఆవిష్కరణ...! 1 y ago

featured-image

ఫ్రాన్స్ అత్యాధునిక ఫైటర్ జెట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వాడుతున్న రఫేల్ విమానాల్లో అత్యంత శక్తిమంతమైన వెర్షన్ ఎఫ్ 5 ను తీసుకురావాలని భావిస్తోంది. దీనిని సూపర్ రఫేల్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ విమానాలు స్క్రామ్ జెట్ హైపర్సొనిక్ క్షిపణులను తీసుకెళ్లేట్లు డిజైన్ చేయనున్నారని సమాచారం. ఆ విమాన నిర్మాణ సంస్థ డసో సీఈవో ఎరిక్ ట్రాప్పియర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న నెలల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఈ విమాన నిర్మాణ కాంట్రాక్టు లభించవచ్చని వెల్లడించారు. 2030 నాటికి ఈ జెట్ ఫ్రాన్స్ వాయుసేనలో చేరనుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD