బడ్జెట్ ప్రతులను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి.. 1 y ago
TG: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆరో రోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. బుధవారం 2025-26 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ఇవాళ ఆయన ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారి ముందు బడ్జెట్ ప్రతులను పెట్టి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపాక.. ఉదయం 11.02 నిమిషాలకు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.