U.S.: ఫైవ్ ఐస్' నుంచి కెనడాను బహిష్కరించే యోచనలో అమెరికా! 1 y ago
యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల మధ్య నిఘా సమాచారాన్ని పంచుకునే 'ఫైవ్ ఐస్' నెట్‌వర్క్‌లో నుంచి కెనడాను తొలగించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకునే ప్రసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కెనడాను 'ఫైవ్ ఐస్' నుంచి బహిష్కరించాలని వైట్‌హౌస్‌లోని ఒక ఉన్నతాధికారి సూచించినట్లు తెలుస్తోంది.