రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం -KTR 1 y ago
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదికి సన్నబియ్యం అని ఉన్న బియ్యం కూడా ఊడబీకిందని, ప్రజాపాలన అంటే పస్తులేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టుగా.. సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలేదని దుయ్యబట్టారు. మార్చి నుండి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు చేసి.. పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు.