హిందూ ధర్మం కాపాడండి అంటే..కక్ష సాధిస్తారా? 1 y ago
తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హిందూ ధర్మం కాపాడాలని అంటే కక్షసాధింపు చర్యలకు దిగుతారా అని ప్రశ్నించారు. తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారన్నారు. సాధువులపై చేయి చేసుకోవడం బాబు పాలనలోనే జరిగిందని ఆరోపించారు. ఆలయ అధికారులు కూటమి నేతల సేవల్లో తరిస్తున్నారని మండిపడ్డారు.