Ayyana Patrudu: జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో కీలక ప్రకటన 1 y ago
AP : జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారని చెప్పారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దానిపై ఆలోచన చేస్తున్నారన్నారు. అభియోగాలు, బెదిరింపులతో గత జూన్‌లో జగన్ తనకు లేఖ రాశారన్నారు. ఏమీ తేలక ముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వెళుతున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయంచామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోందన్నారు. కనీసం 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చట్టంలో ఉందన్నారు.
కనీసం 10 శాతం సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని జగనే గతంలో చెప్పారని గుర్తు చేశారు. జగన్‌కు అన్నీ తెలిసే అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్న జగన్‌ను క్షమించి వదిలేస్తున్నా అన్నారు. అయితే దీనిపై సభా సంఘానికి నివేదించాలని స్పీకర్‌ను కోరారు లోకేష్, నాదెండ్ల, బుచ్చయ్యచౌదరి. ఇందుకు స్పీకర్ అయ్యన్న స్పందిస్తూ సభా సంఘానికి నివేదించాల్సిన అంశాన్ని తదుపరి నిర్ణయిస్తామన్నారు.