స్కూటీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన 1 y ago
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్కూటీలపై ప్లకార్డులతో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆడ పిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో రూ.లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చిందని విమర్శించారు. కానీ, ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని.. కానీ ఇప్పటి వరకు కనీసం రివ్యూ కూడా లేకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు.