Shami-Gill: అటు షమీ..ఇటు గిల్ రఫ్ఫాడించారు... 1 y ago

featured-image

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బంతితో షమి (5/53), బ్యాటుతో శుభ్మన్ గిల్ (101 నాటౌట్; 129 బంతుల్లో 9x4, 2x6) చెలరేగిన వేళ.. గురువారం గ్రూప్-ఎ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. షమితో పాటు హర్షిత్ రాణా (3/31), అక్షర్ పటేల్ (2/43) విజృంభించడంతో మొదట బంగ్లా.. 49.4 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌటైంది. కుప్పకూలేలా కనిపించిన బంగ్లాదేశను అద్భుత ప్రదర్శనతో హృదోయ్ (100, 118 బంతుల్లో 6x4, 2x6), జేకర్ అలీ (68; 114 బంతుల్లో 4x4) ఆదుకున్నారు. గిల్ తో పాటు రోహిత్ (41; 36 బంతుల్లో 7x4), రాహుల్ (41 నాటౌట్; 47 బంతుల్లో 1x4, 2x6) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం పాకిస్థాన్తో తలపడుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD