YCP Leaders: మిర్చి రైతుల‌కు వైసీపీ హ‌యాంలో గిట్టుబాటు ధ‌ర..! 1 y ago

featured-image

చంద్ర‌బాబు పాల‌న‌లో రైతులు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌న్నారు వైసీపీ నేతలు. కూట‌మి ప్ర‌భుత్వంలో మిర్చి రైతులు క‌న్నీరు పెట్టుకుంటున్నార‌న్నారు. వైసీపీ హ‌యాంలో మిర్చి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించామ‌ని చెప్పారు. ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ చేశామ‌ని తెలిపారు. మిర్చి యార్డును జ‌గ‌న్ సంద‌ర్శిస్తేనే కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ రాశార‌న్నారు. జ‌గ‌న్ తోనే మిర్చి రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు కూట‌మి ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ ఇవ్వ‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు భ‌ద్ర‌త క‌ల్పించామ‌న్నారు. కేసుల్లో ఇరికించేందుకు వైసీపీ నేత‌ల‌పై ఉన్న‌ దృష్టి రైతుల‌పై పెడుతున్నారా అని ప్ర‌శ్నించారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు.

టీడీపీ నాయ‌కులు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు పెడుతూ పాల‌న‌ను గాలికొదిలేశారని చెప్పారు. జ‌గ‌న్ గుంటూరు వ‌స్తే క‌నీసం భ‌ద్రత క‌ల్పించ‌లేద‌న్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకోకుండా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌న్నారు. రైతు బాధ వ‌ర్ణించ‌లేనిద‌న్నారు. జ‌గ‌న్ కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. జ‌గ‌న్ కు ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే దానికి కార‌ణం ఎవ‌రు అని ప్ర‌శ్నించారు. దీనిపై పోలీసులు స‌మాధానం చెప్పాల‌న్నారు. ఈ విష‌యంపై న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD