Credit score: ఉచితంగా క్రెడిట్ స్కోరు తీసుకునే వీలుంది..! 1 y ago
ఒక వ్యక్తి ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో క్రెడిట్ నివేదిక, స్కోరును చూసి తెలుసుకోవచ్చు. క్రెడిట్ స్కోరు 750కి మించి ఉంటే మంచి స్కోరున్నట్లు లెక్క. ఇలా క్రెడిట్ స్కోరు చూసుకోవడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. రుణం లేదా క్రెడిట్ కార్డు కావాలంటూ బ్యాంకులను సంప్రదించినప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించే క్రమంలో క్రెడిట్ స్కోరును చూస్తాయి. దీన్నే హార్డ్ ఎంక్వైరీ అంటారు. మీరు బ్యాంకును సంప్రదించిన ప్రతిసారీ ఆ వివరాలు నివేదికలో నమోదవుతాయి. హార్డ్ ఎంక్వైరీ వల్ల 5-10 పాయింట్ల క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. సంవత్సరానికి ఒకసారి ఒక్కో సంస్థ నుంచి ఉచితంగా క్రెడిట్ స్కోరును తీసుకునే వీలుంది.