ప్రజల ఆశలు నెరవేర్చేలా బడ్జెట్ లేదు -సీపీఐ ఎమ్మెల్యే 1 y ago
TG: బడ్జెట్ పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పోటాపోటీగా హామీలు ఇచ్చారని, ప్రస్తుతం వాటిని నెరవేర్చలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గతేడాది బడ్జెట్ కంటే కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే పెంచారని.. వీటితో ప్రజలకు ఏం మేలు చేస్తారని ఫైర్ అయ్యారు. రూ.23 వేల కోట్లతో కేటాయింపులతో 12 నీటిపారుదల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు.