Toxic: ఒకేసారి కన్నడ.. ఇంగ్లిష్ భాషల్లో టాక్సిక్ 1 y ago
'కేజీఎఫ్' సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు యశ్. ఇప్పుడాయన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'తో గ్లోబల్ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇప్పుడీ సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీషులోనూ ఏక కాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇలా ఓ కన్నడ సినిమా ఒకేసారి ఇంగ్లీషులోనూ తెరకెక్కుతుండటం ఇదే తొలిసారని ఆ చిత్ర వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇది మిగతా భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ డబ్ కానున్నట్లు వెల్లడించారు.