YCP: వాలంటీర్లను వెంటనే రెన్యువల్ చేయాలి 1 y ago
AP : ఫీజు రియింబర్స్‌మెంట్‌కు వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఏ ప్రభుత్వంలో అయినా బకాయిలు ఉంటాయని, కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వాటిని చెల్లించాలన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని కూటమి నాయకులు నమ్మించి మోసం చేశారని, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే నవంబర్ నాటికి సీఎంఎఫ్ఎస్ ఐడీలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. జగన్‌పై కోపంతోనే వాలంటీర్లను రోడ్డుకు ఈడ్చారని, వాలంటీర్లు కరోనా కాలంలో ప్రాణాలు తెగించి పని చేశారని తెలిపారు. వారి జీవితాలు రోడ్డున పడ్డాయని, వెంటనే వారిని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా వారిని రెన్యువల్ చేసే వాళ్లమని చెప్పారు