కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు : శ్రీనివాసులు 1 y ago
AP : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు వైసీపీ నేత కొరుముట్లు శ్రీనివాసులు. ఇది వైసీపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని అన్నారు. తాము ఎన్నో ప్రభుత్వాలు చూశామని, కానీ విధ్వంసం చేస్తూ ప్రజలను భయపెట్టే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు.