Satish Reddy: జగన్‌ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి 1 y ago
AP : సీఎం చంద్రబాబు చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. వైఎస్ జగన్‌ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. వైసీపీ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిల్ దాఖలు చేస్తామన్నారు. అదే విధంగా గవర్నర్‌ని కూడా కలుస్తామని చెప్పారు.
కూటమి సర్కార్‌పై ప్రభుత్వ టీచర్లు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థిపై ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీనివాసులు నాయుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. గాదె శ్రీనివాసులు కూటమి అభ్యర్థి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి సానుకూల వర్గాలే ఆ పార్టీ అభ్యర్థిని ఓడించారని చెప్పారు. కూటమి అభ్యర్థి ఓటమికి ప్రభుత్వ పని తీరే నిదర్శనమన్నారు.