WPL 2025 Final: DC vs MI.. ఫైనల్ పోరుకు రంగం సిద్ధం.! 1 y ago
ఆశగా ఎదురు చూస్తున్న ఫైనల్ వేదిక సిద్ధమైంది. ఈసారి ఏజట్టు టైటిల్ ను ఖరారు చేసుకుంటుందో అనే ఉత్కంఠ స్థాయి పెరిగిపోయింది. క్రికెట్ అభిమానులారా.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025 గ్రాండ్ ఫైనల్‌కు సిద్ధంగా ఉండండి! ఈ శనివారం.. మార్చి 15న రాత్రి 8:00 గంటలకు.. ముంబైలోని ఐకానిక్ CCI-బ్రాబౌర్న్ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది.
నిన్న (Mar-13) జరిగిన ఎలిమినేటర్స్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్‌పై 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముంబై ఇండియన్స్ ఫైనల్ లో అడుగు పెట్టింది. గత కొన్నేళ్లుగా రెండుసార్లు ఫైనల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తొలి WPL టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. 2023 ఫైనల్ లో ఢిల్లీను ఓడించి ముంబై మొదటి టైటిల్ విన్నర్ గా కీర్తి సాధించింది. అయితే ప్రతీకారం తీర్చుకోవాలని ఆత్రుతగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. తమ సత్తాను పదేపదే నిరూపించుకున్న ముంబై ఇండియన్స్‌ను ఈసారి ఫైనల్లో ఎదుర్కోనుంది. ఒకసారి ఇరుజట్ల స్క్వాడ్లు చూద్దాం రండి!
ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: మెగ్ లానింగ్ (C), జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ దీప్తి, ఆలిస్ కాప్సీ, అన్నబెల్ సదర్లాండ్, జెస్ జోనాస్సెన్, మారిజాన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తనియా భాటియా, నందిని కశ్యప్, సారా బ్రైస్, టిటాస్ సాధు.
ముంబై ఇండియన్స్ స్క్వాడ్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ సివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), అమన్‌జోత్ కౌర్, యాస్తికా భాటియా (WK), సజీవన్ సజనా, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, పారుణిక సిసోడియా, అమన్‌దీప్ కౌర్, అక్షిత మహేశ్వరి, జింతిమని కలిత, సైకా ఇషాక్.
మెగ్ లానింగ్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు దూసుకుపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే WPL 2025లో ముంబై ఇండియన్స్‌పై 2 విజయాలు సాధించి.. శనివారం హ్యాట్రిక్ విజయంతో టైటిల్ కొట్టాలని చూస్తుంది. అయితే తమ సత్తాను చాటుతూ.. ముంబై ఈసారి కూడా టైటిల్ కైవసం చేసుకుంటదా.? అని తెలియాలంటే మ్యాచ్ తప్పక చూడాల్సిందే. ఫైనల్ ఉత్కంఠ భరితంగా ఉండనుంది. స్టేడియంలో ప్రత్యక్షంగా చూడలేని వారు జియో స్టార్ యాప్ లో మ్యాచ్ వీక్షించవచ్చు.