Vote Card: దొంగ ఓట్లకు ముగింపు.. ఓటరు-ఆధార్ అనుసంధానం...! 1 y ago

featured-image

ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటరు గుర్తింపు కార్డుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువడుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంది. ఆధార్ కార్డు ద్వారానే పౌరుడి గుర్తింపు నిర్ధారణ జరుగుతుంది. అందుకని ఓటరు ఐడీని ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం ఎన్నికల సంఘం పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు భారత పౌరుడి ఓటరు గుర్తింపును నిర్దారణ చేసేందుకు, ఆధార్ కార్డును స్వచ్ఛందంగా చూపించమని అడిగే అధికారం అధికారులకు ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1950లోని సెక్షన్ 23ని 2021 ఎన్నికల చట్టాల సవరణ చట్టం ద్వారా సవరించబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ నిబంధన ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డుతో ఓటర్ గుర్తింపు కార్డును అనుసంధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం ఆధార్ తో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం ప్రారంభించింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD