Vishwak Sen: ఆశించిన స్థాయిలో నా సినిమాలు లేవు 1 y ago
హీరో విశ్వక్ సేన్ తన తాజా సినిమాపై వచ్చిన విమర్శలని స్వీకరిస్తూ అభిమానులకు క్షమాపణ చెప్పారు. తన సినిమాలు ఆశించిన స్థాయిలో లేవని ఒప్పుకున్నారు. ఇకపై క్లాస్ సినిమా అయినా, మాస్ సినిమా అయినా అసభ్యత ఉండదని హామీ ఇచ్చారు. తనని నమ్మి ప్రోత్సహించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన నిర్మాతలు, పంపిణీదారులు, నటీనటులు, దర్శకులు, రచయితలకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే మంచి కథతో వస్తానని, తన కష్ట సుఖాలలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతా ఒక పోస్ట్ చేశారు.