Vishwadarshanam:వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ.. విశ్వదర్శనం 1 y ago
తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్ మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన జీవితాన్ని "విశ్వదర్శనం" పేరుతో జనార్దన మహర్షి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరిశ్రమలోని ప్రముఖులు, కుటుంబసభ్యులు, నటీనటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఈ చిత్రం ప్రోమో విడుదల కాగా, ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్‌లో విడుదల కానుంది.