Vijay Devarakonda: మరో కొత్త ప్రాజెక్టుకు విజయ్ గ్రీన్ సిగ్నల్.! 1 y ago
విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రెండు చిత్రాలు చేస్తున్న ఆయన, మరో కొత్త ప్రాజెక్టుకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన లవ్-యాక్షన్ కథ విజయ్‌కి నచ్చిందట. కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు లైన్లో ఉండగా, ఇదిగో ఇంకో కొత్త సినిమా కబురు! విజయ్ ఫుల్ ఫామ్ లో ఉన్నారన్నమాట.