Vidudala Rajini: తప్పుల ప్రశ్నిస్తే కేసులు పెట్టడం: విడదల రజినీ ఆందోళన 1 y ago
AP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదన్నారు వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ. కూటమి నాయకుల తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్నారని, ఇందులో భాగంగానే చిలకలూరిపేటలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు ఈడ్చారన్నారు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్‌లోనే దళితుడైనా రాకేష్‌పై కేసు పెట్టారని, ఈ కేసుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అక్రమ కేసులు పెట్టడంలో కూటమి ప్రభుత్వ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు.
కూటమి నాయకులు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఎవరైనా పథకాలు అమలుపై ప్రశ్నిస్తే సాకులు చెబుతూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి నేతలు చెప్పిన విధంగా చేసి పోలీసులు అక్రమ కేసులు పెడితే చట్టం ముందు నిలబెడతామని, అక్రమాలకు పాల్పడిన వారు ఏదోక రోజు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థపై తనకు గౌరవం ఉందని, కానీ రూల్స్ అతిక్రమించి తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే రెడ్‌బుక్ లక్ష్యమని, అందులో భాగంగానే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.