ప్రధాని మోదీతో యూఎస్ఏ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ తలసీ గబ్బర్డ్ భేటీ..! 1 y ago
అమెరికన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రక్షణ, సమాచార భాగస్వామ్య రంగాలపై చర్చించారు. ఈ మేరకు ‘అమెరికా జాతీయ నిఘా అధిపతిని కలవడం సంతోషంగా ఉంది. మంగళవారం సమావేశంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా వృద్ధి చేసుకునే మార్గలను చర్చించాం’ అని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.