Trump: జెలెన్కీకి కృతజ్ఞత లేదు...ట్రంప్ వ్యాఖ్యలు..! 1 y ago
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకొన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీకి కృతజ్ఞత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్స్కీ తీసుకొన్నట్లు అభివర్ణించారు. “అతను పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ సర్కారు నుంచి సొమ్ములు తీసుకొన్నారు. ఇటీవల ఖనిజాల ఒప్పందం కోసం అమెరికాలోని శ్వేతసౌధానికి వచ్చిన జెలెన్స్కీ అక్కడ వాగ్వాదం జరగడంతో సంతకాలు చేయకుండానే వెళ్లిపోయిన విషయం తెలిసిందే.