Trump: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్..! 1 y ago
దేశ వ్యాప్తంగా ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లను బహిష్కరించాలని నిరసనలు వెల్లవెత్తుతోన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేసింది. మస్క్ బిజినెస్ కు దన్నుగా నిలిచేందుకు ఇచ్చిన మాట మేరకు ఆయన మంగళవారం టెస్లా ఎరుపు రంగు సెడాన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. అయితే కారు ధర అక్షరాల 80 వేల డాలర్లు. నేరుగా కారును ఎలాన్ మస్క్ వైట్ హౌజ్ ఎదుట పార్క్ చేసి ఇంటీరియర్ గురించి మొత్తం ట్రంప్ కు వివరించారు.