Trump: సుంకాలు విధిస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, భారత్‌కు సంబంధించిన విషయంపై స్పష్టత ఇచ్చారు. సుంకాలు విధిస్తే మేము కూడా అదే విధంగా సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పారు. భారత ప్రధాని మోదీకి తాను ఇదే విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన, అన్ని దేశాలపై తన వైఖరి ఒకేలా ఉంటుందని, ఈ విధంగా సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా తమ వాణిజ్య విధానానికి సరిపోతుందని వివరించారు.