Hanumakonda Rudreswara Swamy: వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు..! 1 y ago
TG: హనుమకొండ రుద్రేశ్వర స్వామి వేయిస్థంభాల ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. ఈనెల 25న చండీహోమం, సుప్రభాత సేవలతో మొదలై గణపతి పూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, రక్షాబంధనం, రుత్వికరణం, స్వామివారికి రుద్రాభిషేకాలు, 26న మహాశివరాత్రి సందర్భంగా శివకల్యాణం, రుద్రాభిషేకాలు, నిత్యవిధి హావనం, సాయంత్రం రుద్రేశ్వరీ,రుద్రేశ్వరస్వామి వారి కల్యాణం ఉంటుందన్నారు.