హైకోర్టుతో ఆటలు..రూ.కోటి జరిమానా 1 y ago
TG: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పునిచ్చారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు రూ.కోటి జరిమానా విధిస్తు తీర్పునిచ్చారు. అక్రమ మార్గాల్లో విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలను న్యాయస్థానం అడ్డుకుంది. కాగా, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్దకు పిటిషనర్లు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై జస్టిస్ నగేశ్ తీవ్రంగా మండిపడ్డారు.