Murali: రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు: మురళీ 1 y ago
AP : వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ వైపు అడుగులు వేస్తోందన్నారు. 8 నెలల కాలంలో అనేక విజయాలు సాధించామన్నారు. వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ప్రతి పేదవాడి నుంచి కోటీశ్వరుడి వరకు భూమిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. అనేక మందికి భూమితో అనుబంధం ఉందన్నారు. కానీ గత ప్రభుత్వంలో ఎవరి భూమి లాక్కుంటారో అని భయం ఉండేదన్నారు. వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గందరగోళాన్ని సృష్టించిందన్నారు.