భూమి పై చేరుకునున్న సునీత విలియమ్స్..! 1 y ago
అంతరిక్షం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పుడమిని చేరుకున్నారు. తొమ్మిది నెలల పాటు రోదసిలో చిక్కుకుపోయిన సునీత, బుచ్ విల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’.. బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర జలాల పై దిగింది. దింతో ఆమె క్షేమంగా భూమిని చేరుకోవడంతో భారత్ లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి.