రక్షణ కల్పించండి.. కడప ఎస్పీకి సునీల్ యాదవ్ వినతి 1 y ago
AP: తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కడప ఎస్పీని వివేకా హత్య కేసు నిందితుడు సూనీల్ యాదవ్ కోరారు. వివేకా హత్య కేసు నిందితులు జైల్లో తనను బెదించారని చెప్పాడు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదని చెప్పుకొచ్చాడు. హత్యకు సంబంధించిన సినిమాలోనూ తనను క్రూరంగా చిత్రీకరించారన్నారు. అయితే హత్య సినిమాలో నలుగురే చంపినట్లు చూపించారని, కానీ, ఎనిమిది మంది చంపినట్లు ఎందుకు చూపించలేదని సునీల్ యాదవ్ ప్రశ్నించారు.