Germany: సమ్మె కారణంగా జర్మని ఎయిర్పోర్ట్ లో విమానాలు రద్దు.... 1 y ago

featured-image

బెర్లిన్: జర్మనీలోని విమానాశ్రయాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు అదనపు సమయానికి ఎక్కువ మొత్తంలో బోనస్ ఇవ్వాలని కోరుతూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్ సహా ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఒక్క ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు నుంచి 1,116 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా ఇందులో 1054 సర్వీసులు రద్దయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మొత్తంగా 3400 విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. దాదాపు 5లక్షల మంది ప్రయాణికులపై ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD