Stock Market: స్టాక్ మార్కెట్ భారీ పతనం 1 y ago
8K News-24/02/2025 దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి.సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు పైగా కోల్పోయాయి. 18 ప్రధాన రంగ సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఫిబ్రవరిలో రూ.28,140 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ట్రంప్ విధానాలతో అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి, భారత్‌లో పెట్టుబడులు తగ్గనున్నట్లు నోమురా హెచ్చరించింది. ట్రంప్ టారిఫ్ ప్రభావం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు పతనమయ్యాయి.