Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్..! 1 y ago
8K News-21/02/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్లు తగ్గి 75,668 వద్ద.. నిఫ్టీ 9 పాయింట్లు కుంగి 22,903 వద్ద ఉన్నాయి.