Champions Trophy:ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధం.. 1 y ago
వన్డేల్లో ప్రపంచకప్ తర్వాత, అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2017 తర్వాత రద్దయి, మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పొందనున్న టోర్నీకి పాకిస్థాన్, యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య జట్టు పాకిస్థానే అయినప్పటికీ.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ అంగీకరించని నేపథ్యంలో, రోహిత్ సేన ఆడే మ్యాచ్లకు దుబాయ్ వేదిక కానుంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటడనడంలో సందేహం లేదు. గురువారం బంగ్లాదేశ్ మ్యాచ్లో భారత్ తన పోరాటాన్ని ఆరంభిస్తుంది. అంతకంటే ముందు, బుధవారం పాకిస్థాన్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్లో తలపడతాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు. వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.