ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి -సోనియా 1 y ago
TG: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 కూలీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో జీరో అవర్ లో ఆమె చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 2005 లో తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. NDA ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమన్నారు.