Pakistan: పాకిస్తాన్లో నీటి కరువు..700 అడుగుల వరకు తవ్వినా రాని నీరు! 1 y ago
పాకిస్తాన్లో నీటి కరువు తీవ్రమైంది. 700 అడుగుల వరకు తవ్వినా నీరు రావడం లేదు. తిండికే కష్టంగా ఉన్న ప్రజలకు ఇది మరింత కష్టంగా మారింది. దీనివల్ల పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో వర్షాలు తగ్గిపోవడం, రిజర్వాయర్లు బాగా ఖాళీ అయ్యే పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రావల్పిండి నగరంలో రోజూ 68 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమైనా, అందుబాటులో ఉన్న నీరు కేవలం 51 మిలియన్ గ్యాలన్లే. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పాకిస్థాన్ ప్రజలు నీటి కోసం మరిన్ని నీటి కష్టాలు ఎదుర్కొంటారు.