తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేదు : మంత్రి సీతక్క 1 y ago
TG : ప్రస్తుతం తాగునీటి సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు మంత్రి సీతక్క. వేసవిలో తాగునీటి కోసం రిజర్వాయర్ల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. భూగర్భ జలవనరుల సరఫరా కూడా అన్ని సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.