Canada: కెనడా వలస నిబంధనల్లో కీలక మార్పులు...! 1 y ago
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. జనవరి 31 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలతో, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈటీఏ, టీఆర్వీ, వర్క్ మరియు స్టడీ పర్మిట్లను రద్దు చేసే అధికారం లభించింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతేడాది తొలి ఆరు నెలల్లో 3.6 లక్షల ట్రావెల్ వీసాలు జారీ చేయగా, కొత్త నిబంధనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.