Revanth: ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..! 1 y ago
TG: TDR పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సన్నద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్లో మట్లాడుతూ.. హైదరాబాద్ లో ఉన్న TDR మొత్తం షేర్లను కొంత మంది రేవంత్ అనుచరులు కొంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే FSI అమలు చేసి TDR లను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసెంబ్లీ జరుగుతుండగానే ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు మరోసారి నోటీసులు ఇస్తారని భావిస్తున్నానని కేటీఆర్ అన్నారు. అయితే అదొక లొట్టపీసు కేసని, దాని గురించి భయపడనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే క్రైమ్ చేయరని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని రేవంత్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి మెట్రో తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే ఆయనకు సన్మానం చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే.. రాలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ కు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే ఈటల వచ్చారు.. కానీ కిషన్ రెడ్డి రాలేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిల పక్షంపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారనే అనుకుందామని.. మరి ఖట్టర్ కూడా సడెన్గా వచ్చారా అని రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలను కేంద్ర సమానంగా చూడటం లేదని.. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారని, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత.. తిరిగి కేంద్ర తమకు కేటాయిస్తున్న నిధులపై తాన చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.