ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు : రేవంత్ 1 y ago
TG : ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ను ఛైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ నివాళులర్పించారు.