Ranji Trophy finals: హోరాహోరీగా సాగుతున్న రంజీ ఫైనల్ 1 y ago
విదర్భ, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి మూడు రోజుల ఆటలో రెండు జట్లు దాదాపు సమానంగా పోరాడినా.. విదర్భకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో చివరి రెండ్రోజుల ఆట కీలకంగా మారింది. విదర్భ ఎడమచేతి వాటం స్పిన్నర్ దూబె రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కేరళ జట్టు మూడో రోజు మ్యాచ్ నిలిచే సమయానికి 125 ఓవర్లలో 342 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సచిన్ బేబీ (98; 235 బంతుల్లో 10x4) అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు.