Sourav Ganguly: నా బయోపిక్ కి పర్ఫెక్ట్ అతనే.. సౌరభ్ గంగూలీ 1 y ago
ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం త్వరలో వెండితెర పైకి రానుంది. అతడి బయోపిక్ సినిమా కోసం కొన్నేళ్లుగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇందులో నటించే హీరో ఖరారయ్యాడు. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు.. బిగ్ స్క్రీన్‌పై గంగూలీగా కన్పించనున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ స్వయంగా వెల్లడించారు. పశ్చిమబెంగాల్ లోని బర్ధమాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గంగూలీ పాల్గొన్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ బయోపిక్ వివరాలను పంచుకున్నాడు.