Rabindranath Reddy: పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు మద్దతు ఇవ్వాలి..! 1 y ago
ఏపీ : రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరుగుతోందన్నారు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం లేదన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదన్నారు. ఈ క్రాప్ వ్యవస్థను నాశనం చేశారన్నారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని తెలిపారు.
వైసీపీ హయాంలో రైతులకు పెద్దపీట వేశామన్నారు. రైతులను ఆదుకునేందుకు సున్నా వడ్డీలు ఇచ్చామన్నారు. పంట నష్టం జరిగితే వెంటనే మద్దతు ధర కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకే మద్దతు ధర ఇస్తుందన్నారు. అయితే కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంటలకు కూడా నష్టపరిహారం అందించామని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోవడం లేదన్నారు. మిర్చి రైతులు నష్టపోతున్నా ఒక్క చిన్న రివ్యూ కూడా చేయలేదన్నారు. ఇప్పటికే లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేశారని కానీ ఆ డబ్బును ఏమి చేశారో తెలియదన్నారు.