బ్యాంకులు.. ఏఐ సేవలను వాడుకోండి: ఆర్బీఐ గవర్నర్ 1 y ago
దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలపై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు AIని ఉపయోగించాలని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఏటీఎం ఫెయిల్యూర్, తప్పుడు చార్జీల గుర్తింపునకు, ముందస్తు వార్నింగ్ మెసేజ్‌లు పంపేందుకు, ఆర్థిక సంస్థలు డేటా విశ్లేషణ కోసం AIని వినియోగించుకోవచ్చన్నారు. అదేవిధంగా ఏఐ ద్వారా పనిచేసే చాట్ బాట్‌లు, వాయిస్ రికగ్నిషన్ సాధనాలను కూడా వాడుకోవచ్చని సూచించారు.